పూర్తయిన డబుల్ బెడ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి.. 

-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

పూర్తయిన డబుల్ బెడ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి.. 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

జిల్లాలో నిర్మాణాలు, వసతులు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్, కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇందిరమ్మ ఇళ్ల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 135 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి స్థాయిలో, సౌకర్యాలతో లబ్ధిదారులకు అందజేతకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇట్టి ఇండ్లకు గుర్తించిన అర్హుల జాబితా నుండి, దివ్యాoగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, నిరుపేద వారు ప్రాతిపదికన జాబితా ఎంపిక చేసి శనివారం లోగా అందజేయాలన్నారు. ఖమ్మం అర్బన్ లో నిర్మాణాలు పూర్తయి కేటాయింపుకు సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 4 ఇండ్లను ట్రాన్సజెండర్లకు ఇవ్వాలని కలెక్టర్ అన్నారు.
నిర్మాణాలు పూర్తయి, లబ్ధిదారులకు అందజేతకు సిద్ధంగా ఉండి, అర్హుల జాబితా సిద్ధం కాని ఇండ్లు 470 ఉన్నట్లు, వీటిలో స్వీకరించిన దరఖాస్తుల విచారణ పూర్తి చేసి, జాబితాను రెండు వారాల్లో సమర్పించాలన్నారు.
ఇండ్ల నిర్మాణాలు పూర్తయి, కనీస సౌకర్యాల కల్పన చేయాల్సిన ఇండ్లు జిల్లాలో 635 ఉన్నట్లు, ఇట్టి వాటిలో కనీస సౌకర్యాల కల్పనకు కావాల్సిన నిధులకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
జిల్లాలో నిర్మాణాలు పూర్తికాక, వివిధ స్థాయిల్లో ఉన్న నిర్మాణాలు పూర్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు. సంబంధిత నిర్మాణదారులతో మిగులు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. 
పనులు గ్రౌండింగ్ అయి, పాక్షికంగా నిర్మాణాలు జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు జిల్లాలో 702 ఉన్నట్లు, వీటిని పూర్తికి నిధుల వివరాలు సమర్పించాలన్నారు.
ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్వో రాజేశ్వరి, హౌజింగ్ ఇఇ శ్రీనివాస రావు, ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గట్టి వ్యతిరేకం. ప్రాణాలకు ముప్పు… హుజురాబాద్ వద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్‌కు గట్టి వ్యతిరేకం.
హుజురాబాద్, మే 2(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని వేస్ట్...
పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణం.
పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.!
పెద్దమందడి సింగిల్ విండో సీఈవో జగదీశ్వర్ రెడ్డికి ఘన వీడ్కోలు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం.
వేలేరు మండల కేంద్రంలో ఘనంగా మే డే వేడుకలు.
ప్రపంచ కార్మికులారా ఏకంకండి నినాదాలతో మేడే.