సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహదినం మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ
సీపీఎస్ రద్దు కోసం ఉపాధ్యాయ సంఘాల దీర్ఘకాల పోరాటం
Views: 37
On
-“సీపీఎస్ అంతం – పీఆర్టీయూ పంతం” నినాదంతో మహా ధర్నా పిలుపు
-ఇందిరా పార్క్ వద్ద భారీ స్థాయిలో విజయవంతం చేయాలని పీఆర్టీయూ పిలుపు
ధర్మసాగర్,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
పీఆర్టీయూ టీఎస్ ధర్మసాగర్ మండలశాఖ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహదినం సందర్భంగా చేపట్టబోయే మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ధర్మసాగర్ హైస్కూల్ బాలుర పాఠశాలలో జరిగింది.ఈ సందర్భంగా మండలశాఖ అధ్యక్షులు అనిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, 2004 సెప్టెంబర్ 1 నుండి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను అమలు చేస్తున్నాయని తెలిపారు. అప్పటి నుండి ఉపాధ్యాయ సంఘాలు సీపీఎస్ రద్దు కోరుతూ పలు దశల్లో నిరసనలు చేపట్టినా, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనివార్య పరిస్థితుల్లో పోరుబాట పట్టిన నేపథ్యంలో “సీపీఎస్ అంతం – పీఆర్టీయూ పంతం” అనే నినాదంతో సెప్టెంబర్ 1న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సీపీఎస్ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని ఐక్యంగా దీన్ని విజయవంతం చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments