వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 10,463 కేసుల పరిష్కారం 

విజయవంతంగా ముగిసిన జాతీయ లోక్‌ అదాలత్‌ 

వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 10,463 కేసుల పరిష్కారం 

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:

జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమం శనివారం వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించారు. న్యాయ సేవా సదనంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.వి. నిర్మల గీతాంబ, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. అపర్ణాదేవి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడుతూ, “కక్షిదారులు రాజీపడదగిన కేసులను స్నేహపూరిత వాతావరణంలో పరిష్కరించుకుని న్యాయబద్ధమైన తీర్పును పొందాలని” సూచించారు.

పెండింగ్‌ కేసుల పరిష్కారం:

వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న మొత్తం 10,463 కేసులను పరిష్కరించారు.వరంగల్‌ జిల్లాలో 4,160 కేసులు,హనుమకొండ‌ జిల్లాలో 6,303 కేసులు
ఇందులో సివిల్‌ కేసులు, క్రిమినల్‌ కేసులు, బ్యాంకు రుణాలు, విద్యుత్‌ బకాయిలు వంటి కేసులను రాజీ ద్వారా సత్వర పరిష్కారం చేశారు.

కౌన్సిలింగ్‌ విజయాలు:

2017లో విడిపోయిన ఒక దంపతులను నాలుగు దఫాల కౌన్సిలింగ్‌ ద్వారా కలిపి, వారి వైవాహిక జీవనాన్ని పునరుద్ధరించారు.

జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా 700 మందికి పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు. లోక్‌ అదాలత్‌ విజయవంతం కావడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారికి న్యాయ సేవాధికార సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జి. ప్రేమలత, మనీషా శ్రావణ్, న్యాయ సేవాధికార సంస్థల కార్యదర్శులు సాయి కుమార్, క్షమాదేశ్‌ పాండే, కలెక్టర్‌ సత్య శారద, డీసీపీ పి. రవీందర్‌రావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు తీగల జీవన్‌ గౌడ్‌, న్యాయవాదులు, లోక్‌ అదాలత్‌ సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .