సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
శుక్రవారం ఖమ్మం నగర కేంద్రంలోని నూతన కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు 10 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతును తెలియజేసింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బషీరుద్దీన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ లో మాట్లాడుతూ సమగ్ర శిక్షలో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని పేస్కేల్ ఇవ్వాలని కోరుతూ ఉద్యోగులు గత పది రోజులుగా సమ్మె చేస్తున్నారు వారికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీలు సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. గత 18 సంవత్సరాలుగా 19600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ వారిని రెగ్యులైజ్ చేయకపోవడం కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారిని రెగ్యులైజ్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు 18 ఏళ్లుగా వారు తక్కువ జీతాలకు పని చేస్తున్నారు కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలని అన్నారు. జిల్లాస్థాయిలో ఏపీవో సిస్టం అనలిస్టు టెక్నికల్ పర్సనల్ ఆపరేటర్లు డి ఎం ఎం టి మెసెంజర్లు అదేవిధంగా మండల స్థాయిలో ఎమ్మెల్యే కోఆర్డినేటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో సీఆర్పీలుగా పాఠశాల స్థాయిలో ఎన్నో ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేయాలని అదేవిధంగా ప్రభుత్వమే ప్రైవేటు వ్యవస్థ లాగా ఉద్యోగుల శ్రమను దోపిడీ చేయడం సిగ్గుచేటని వారికి ఆరోగ్య కార్డులో మహిళలకు ప్రసూతి నెల పలు జీవిత బీమాలు ఇవ్వాలని అన్నారు వీటన్నింటిని సమస్యల పైన ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకపోవడంతో వారు నిరోధిక సమ్మెకు దిగి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ స్పందించకపోవడం చాలా దుర్మార్గమని వారు అన్నారు ఇప్పటికైనా టిఆర్ఎస్ ప్రభుత్వం వలే కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి వారు కోరుకుంటున్న అటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి కేజీబీవీ విద్యాసంస్థల్లో పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు చదువు అందేలా చూడాలని వారు తెలియజేశారు లేని పక్షంలో వారికి అండగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఉంటూ పెద్ద ఎత్తున పోరాటాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణ ఎస్ఎఫ్ఐ నాయకులు మనోజ్, త్రినాథ్ ,ఉదయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments