చిత్తడి బతుకులకు శీనన్న కుటుంబం చేయూత

- సర్వం కోల్పొయిన వారికి మేమున్నామనే భరోసా

చిత్తడి బతుకులకు శీనన్న కుటుంబం చేయూత

IMG-20240914-WA0020- ఇంటింటికి తిరిగి ధైర్యం చెబుతూ పీఎస్ఆర్ ట్రస్ట్ తరుపున ఆర్థిక సాయం

- హర్షం వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబాలు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 వరదభీభత్సానికి సర్వం కోల్పొయిన పాలేరు నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలకు మేమున్నామనే భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చారు మంత్రి పొంగులేటి శీనన్న కుటుంబ సభ్యులు.... ఇంటింటికి తిరిగి ధైర్యం చెబుతూ పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున ఆర్థిక సాయం అందిస్తున్నారు. మంత్రి హెూదాలో పొంగులేటి శీనన్న పాలేరు నియోజకవర్గంలోని ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 16,500నష్టపరిహారంతో పాటు నిత్యావసరాలను సకాలంలో చేర్చడంలో సఫలీకృతులయ్యారు. ఎనలేని సేవా దృక్పథం కలిగిన పొంగులేటి తొలుత తమ పీఎస్ఆర్ ట్రస్ట్ తరుపున వారం రోజుల పాటు మూడు పూటల బాధిత కుటుంబాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు, పార్టీ నాయకుల సహకారంతో బాధితుల ఇళ్ల వద్దకు ఆహారాన్ని పంపించారు. ప్రభుత్వం తరుపున అందిన సాయంతో పాటు తమ ట్రస్ట్ తరుపున ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుని తన సతీమణి పొంగులేటి మాధురి, సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తో పాటు ట్రస్ట్ సభ్యులు వై. రామకృష్ణ రెడ్డి, డి. శ్రీనివాస రెడ్డి తో పాటు ఇతర కుటుంబ సభ్యుల ద్వారా బాధిత కుటుంబాలకు సాయం అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పాలేరు నియోజకవర్గంలో వరద ముంపుకు గురైన ప్రతీ కుటుంబానికి రూ. 5వేలు ఆర్థికసాయంతో పాటు రెండు దుప్పట్లు, రెండు చీరలు, లుంగీలు, టీషర్ట్ లు, టవల్స్ ను అందిస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మం రూరల్ మండలంలోని నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో 214, రాజీవ్ గృహకల్పలో 249, వికలాంగుల కాలనీ, సాయి నగర్ లోని 222, జలగం నగర్ లో 721, కెబిఆర్ నగర్ లో 199, టెంపుల్ సిటీలో 308, సాయి ప్రభాత్ నగర్ లో 111, అభయ టౌన్ షిప్ లో 527, దానవాయిగూడెంలో 527, రామన్నపేటలో 719 కుటుంబాలకు శనివారం రోజున సాయం అందించారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగిస్తామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. సాయం అందుకున్న బాధిత కుటుంబాలు తాము నమ్మి గెలిపించుకున్న పొంగులేటి శీనన్న తమకు అన్ని విధాలుగా అండగా నిలవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .