సొసైటీ సీఈఓకి ఘన వీడ్కోలు.

సొసైటీ సీఈఓకి ఘన వీడ్కోలు.

 

సత్తుపల్లి, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం, గంగారం గ్రామంలో పి.ఏ.సి.ఎస్ సొసైటీ సీఈఓగా దాదాపు 37 ఏళ్లపాటు రైతులకు అంకితభావంతో సేవలందించిన చీపు వీరస్వామికి శుక్రవారం స్థానిక సొసైటీ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఇటీవల జరిగిన బదిలీల కారణంగా ఆయన ఇకపై సత్తుపల్లి సొసైటీ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో రైతులు, సూపర్ స్టార్ కృష్ణ–మహేష్ అభిమానులు కలిసి ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ,
రైతుల్లో ఒకరిగా మాతో కలిసిపోతూ, ఎప్పటికప్పుడు సహాయం చేసిన వీరస్వామి సేవలు మరువలేనివి. ఆయన మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫాన్స్ డివిజన్ అధ్యక్షులు కోటమర్తి వెంకటేశ్వరరావు, చల్లారి సత్యన్నారాయణ, బండారి మారేశ్వరరావు, ఊకే కన్నారావు, గండ్ర లోకేష్ రెడ్డి, మందపాటి నర్సారెడ్డి, మందపాటి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .