సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఇంజనీర్ నాగభూషణం కు వినతి
ఆర్ యు బి , ఆర్ ఓ బి పనులు త్వరగా చేపట్టాలని
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:
సికింద్రాబాద్ డిఆర్ఎమ్ కార్యాలయం లో సికింద్రాబాద్ డిఆర్ఎమ్ గోపాలకృష్ణన్, సౌత్ సెంట్రల్ రైల్వే, రైల్వే చీఫ్ ఇంజనీర్ నాగభూషణం ని మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గం లోని ఆర్ యు బి మరియు ఆర్ ఓ బి పనులు త్వరగా చేపట్టాలని వినతి పత్రం అందజేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి . అందుకుగాను సికింద్రాబాద్ డిఆర్ఎం మరియు రైల్వే చీఫ్ ఇంజనీర్ రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో ఆర్ యు బి/ఆర్ఓబి పనులు కొరత గతిన చేపట్టాలని, భూదేవి నగర్ (ఆల్వాల్) రైల్వే స్టేషన్ పాదచారులకు దారి కొరకు అడిషనల్ గేటు ఏర్పాటు చేయాలని ,
శ్రీనగర్ కాలనీలో (మౌలాలి) డ్రైనేజీ కొరకు ఐలా స్థలం గుండా వెళ్లేందుకు అనుమతి తీసుకొని డ్రైనేజీ పైపులైను వేయాలని,
తాళ్లబస్తీ ఇక్రిసెట్ కాలనీ ఈస్ట్ ఆనంద్ బాగ్ లో రైల్వే కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని.
వాజ్పేయి నగర్, నేరెడిమేట్ (బి పి 8) అర్ యు బి పనులు త్వరగా చేపట్టాలని అదే విధంగా చంద్రగిరి వినాయక్ నగర్ కాలనీలో రైల్వే స్థలంలో నీరు నిల్వ ఉన్నచోట డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జె ఎ సి వెంకన్న, అనిల్ కిషోర్ గౌడ్, డోలి రమేష్, చిన్న యాదవ్, ఉస్మాన్, వంశీ ముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, బంటి, భరత్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments