ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి 

ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్ ప్రారంభం

ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక దృష్టి 

-పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

ములుగు,తెలంగాణ ముచ్చట్లు:

ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, వైద్య రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యత ఇస్తుందని 
రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.బుధవారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి వద్ద 6 ఈఎంఆర్ఐ 108 సర్వీస్ అంబులెన్స్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఎ పిఓ చిత్రా మిశ్రా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క  మాట్లాడుతూ, ములుగు జిల్లాలోని అన్ని మండలాల్లో 9 ఈఎంఆర్ఐ 108 సర్వీసులు ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. అలాగే మంగపేట, తాడ్వాయి, ములుగు, నూగురు వెంకటాపురం మండలాలకు 4 కొత్త అంబులెన్స్ లను మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు.

ట్రాన్స్ జెండర్ ల సంక్షేమానికి ప్రత్యేక ఆస్పత్రి

ప్రత్యేకంగా ట్రాన్స్ జెండర్ ల కోసం ఏర్పాటుచేసిన మైత్రి ట్రాన్స్ వుమెన్ క్లినిక్ ను ప్రారంభించారు. “ట్రాన్స్ జెండర్లు అర్థనారీశ్వరుల స్వరూపాలు” అని మంత్రి పేర్కొన్నారు.  సమాజంలో వివిధ అవమానాలు ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె వివరించారు.

ట్రాన్స్ జెండర్ లకు వైద్య సేవలు

ఈ క్లినిక్ ద్వారా సమాన గౌరవం, సమగ్ర వైద్యం అనే నినాదంతో ట్రాన్స్ జెండర్లకు వైద్య, ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఉంటుందని మంత్రి అన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ క్లినిక్ ద్వారా ఆరోగ్య, ఆరోగ్యేతర సేవలు, కౌన్సిలింగ్, లింగ ఆధారిత సేవలు అందిస్తామని తెలిపారు. ఇంకా, 30 మంది ట్రాన్స్ జెండర్లకు 9 మందికి ట్రాన్స్ జెండర్ ఐడి కార్డు ఇవ్వడం, 50,000 రూపాయల సబ్సిడీతో నాన్ బ్యాంక్ లింకేజీ ద్వారా సాయం అందించడం జరిగిందని చెప్పారు.


WhatsApp Image 2024-12-11 at 8.44.49 PMఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడా కుల అశోక్, డీఎం అండ్హెచ్ ఓ గోపాలరావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్, ఐటీడీఏ జిల్లా వైద్య అధికారి డాక్టర్ కే. క్రాంతి కుమార్, ట్రాన్స్ జెండర్ సంఘం జిల్లా నాయకురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .