దేవీ నవరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు
కాప్రా, సెప్టెంబర్ 22(తెలంగాణ ముచ్చట్లు):
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీర్పేట్ హెచ్ బీ కాలనీ, డివిజన్ హెచ్ బీ కాలనీ, వెంకటేశ్వర నగర్ షిరిడి సాయిబాబా ఆలయం లో ఏర్పాటు చేసిన అమ్మవారి దర్శన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజల ద్వారా భక్తులకు ఆత్మీయ సందేశాలు అందించారు.పూజల అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి ఆశీర్వాదాలు ఉప్పల్ నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ కురిసేలా ఉంటారని ఆకాంక్షించారు. అనంతరం ఆయన, కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి శాలువాతో సన్మానింపబడ్డారు.ఈ కార్యక్రమంలో షిరిడి సాయిబాబా సంస్థ ట్రస్టు కార్యవర్గ సభ్యులు నాదం చారి, వీరభద్రరావు, సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు బోదాసు లక్ష్మీనారాయణ, నేమూరి మహేష్ గౌడ్, నిసార్ అహ్మద్ గోరి, దండెం నరేందర్ పాల్గొన్నారు.


Comments