శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం

శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం

మల్కాజిగిరి, అక్టోబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్‌లో ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి దేవాలయంలోని ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం సందర్భంగా భక్తిశ్రద్ధలతో అభిషేకం, అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు మణికంఠ శర్మ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – సంతానం, వివాహం, ఉద్యోగం, కాలసర్పదోషం, నవగ్రహ దోష నివారణ కోసం భక్తులు సంకల్పం చేసి స్వామివారికి అభిషేకం నిర్వహించారని తెలిపారు.WhatsApp Image 2025-10-14 at 7.58.58 PMఅలాగే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆలయ ఈఓ పి. శ్రీకాంత్ ఆశీర్వదించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూజా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ఆలయ చైర్మన్ దాసరి అమర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుభ్రమణ్యేశ్వర స్వామి వారి దర్శనం పొందారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .