నాగారంలో చిడంబ్ తైక్వాండో ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం

నాగారంలో చిడంబ్ తైక్వాండో ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం

నాగారం, తెలంగాణ ముచ్చట్లు:

తైక్వాండో శిక్షణ ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాగారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గూడూరు ఆంజనేయులు తెలిపారు. నాగారం పురపాలక సంఘం 7వ వార్డులో విజయ్ హాస్పిటల్ ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన చిడంబ్ తైక్వాండో అకాడమీ ఇన్‌స్టిట్యూట్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటే మహిళలు కూడా అనుకోని దాడుల నుంచి రక్షించుకోవచ్చని అన్నారు. కరాటే వలె తైక్వాండో గొప్ప క్రీడ అని, ఇందులో శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయని పేర్కొన్నారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ విధమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు.

చిడంబ్ తైక్వాండో అకాడమీ యాజమాన్యం సమర్థవంతంగా శిక్షణ తరగతులు నిర్వహించి పిల్లలకు నాణ్యమైన శిక్షణ అందించాలని ఆయన కోరారుIMG-20250816-WA0075అనంతరం గూడూరు ఆంజనేయులను శాలువాతో సన్మానించి మెమెంటో అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ ఎ. ప్రవీణ్ కుమార్, మాస్టర్ ఎ. కిషోర్ కుమార్, అకాడమీ యాజమాన్యం, ఇతరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .