లింగాలపల్లిలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల సమ్మేళనం.
మంత్రి తుమ్మలతో పాటు పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
అశ్వారావుపేట, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేట మండలంలోని లింగాలపల్లి గ్రామంలో రేపు (శనివారం) ఉదయం 10 గంటలకు రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పామాయిల్ సాగు జరుగుతున్న నియోజకవర్గాల శాసనసభ్యులు హాజరు కానున్నారు.
ఈ రాష్ట్రస్థాయి సమ్మేళనం ప్రధాన ఉద్దేశం తెలంగాణను పామాయిల్ హబ్‌గా అభివృద్ధి చేయడమే. భవిష్యత్తులో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగును విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా పామాయిల్ కనీస మద్దతు ధర, ఉత్పత్తి, క్రషింగ్, సాగు ప్రోత్సాహకాలు, రాయితీలు వంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, వాటి పరిష్కార మార్గాలపై చర్చించడం జరుగనుంది.
ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పామాయిల్ రైతులు ఈ సమ్మేళనంలో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించారు.


Comments