ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు హైడ్రాకు ఫిర్యాదు
ఏఎస్ రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి
ఏఎస్ రావునగర్, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు) :
ప్రభుత్వ భూములను కబ్జా చేయాలనే ప్రయత్నాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఏఎస్ రావునగర్ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని సర్వే నంబర్లు 199/1, 376లో ఉన్న ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు.
‘లావణ్య పట్టా’ పేరుతో ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలనే కొందరి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మిగడ్డ మారుతి నగర్ ప్రాంతంలోని సుమారు ఎకరన్నర ప్రభుత్వ స్థలంలో ఇప్పటికే కొంతమంది డూప్లెక్స్ ఇళ్లు నిర్మించారని, ప్రస్తుతం దాదాపు 12 గుంటల భూమి మాత్రమే మిగిలి ఉందని పేర్కొన్నారు.ఈ ఘటనపై కాప్రా తహసిల్దార్ సుచరిత కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్రమార్కులు యదేచ్ఛగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తుండటాన్ని ఖండించిన ఆమె, ఈ వ్యవహారంపై తక్షణ విచారణ జరిపి, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాలకు కాపాడాలని హైడ్రా అధికారులను కోరారు.


Comments