రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు.

రాష్ట్ర బీసి, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ 

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు.

- రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలి..

- జిల్లా హెడ్ క్వార్టర్ లో పిల్లలచే రొడ్డు భద్రతా ప్రమాణాల పై భారీ ర్యాలీ

- వసతి గృహాలలో పిల్లలకు అందించే ఆహార నాణ్యత పై తనిఖీలు నిర్వహించాలి.

- రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహన పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్.

మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత వారోత్సవాలను  విజయవంతంగా నిర్వహించాలని  తెలంగాణ రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు.
శనివారం రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రత వారోత్సవాల నిర్వహణ పై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేదని, దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా మాసోత్సవం చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ  వినూత్నంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల పై వేడుకలను ప్రతి గ్రామంలో జరగాలని అన్నారు.  పిల్లల్లో రోడ్డు భద్రతా ప్రమాణాలపై ప్రజలకు వాహనదారులకు అవగాహన కల్పించేందుకు  ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులచే ప్రతి జిల్లా , మండల హెడ్ క్వార్టర్ లో భారీ ర్యాలీ చేపట్టాలని అన్నారు. 
ఆర్ బీ, పంచాయతీ రాజ్ శాఖ తమ పరిధిలో రోడ్డు సేఫ్టీ భద్రతా ప్రమాణాల కార్యక్రమాలు జరగాలని అన్నారు.  రవాణా శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖ, రోడ్డు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు భద్రత కార్యక్రమాలు విజయవంతం చేయాలని మంత్రి అన్నారు.
భారీ తుఫాన్లు, వరదలు, రోగాల వల్ల పోయే ప్రాణాల కంటే రోడ్డు ప్రమాదంలో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నామని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు మనమంతా కలిసి పని చేయాలని అన్నారు. రోడ్డు సేఫ్టీ భద్రతా ప్రమాణాలను పిల్లల సిలబస్ లో కూడా పెట్టెలా చూస్తామని అన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించని వారి లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్తులో జారీ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్వేర్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని అన్నారు.  రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలకు విస్తృత ప్రచారం ఉండాలని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహన కార్యక్రమాల్లో హెల్మెట్ వినియోగం వల్ల కలిగే లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ వినియోగించేలా ప్రోత్సహిస్తూ కొంతమందికి హెల్మెట్ పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. 
మహిళల ప్రయాణికుల సంఖ్య పెరిగిన మార్గాలలో బస్సులు పెరిగే విధంగా రవాణా శాఖ అధికారులు క్రియలు తీసుకోవాలని మంత్రి అన్నారు. రోడ్డు భద్రతా కార్యక్రమాలను అధికారులు ముందుండి నిర్వహించాలని, పాఠశాలలో రోడ్డు భద్రత ప్రమాణాలపై పోటీ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. 
 రెసిడెన్షియల్ వసతి గృహాలలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచామని, విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన ఆహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.  విద్యార్థులకు అందించే ఆహర నాణ్యతను కలెక్టర్లు , ఉన్నతాధికారులు తనిఖీ చేయాలని, ఆహర సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లిస్తున్నామని , నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ ఉండవద్దని మంత్రి అన్నారు.  రోడ్డు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ మాట్లాడుతూ,  జనవరి నెల మొత్తం రోడ్డు భద్రత వార ఉత్సవాల ప్రమాణాల కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు తెలిపారు.  ప్రస్తుత సమాజంలో  జరిగే రోడ్డు ప్రమాదాలలో 75 శాతం  డ్రైవర్ తప్పుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.  రాష్ట్రంలోని వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలు, పాటించాల్సిన నియమ నిబంధనల పై అవగాహన కల్పించాలని అన్నారు. రోడ్ల పై ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ ఏ ఆసుపత్రికి తీసుకుని రావాలి ఒక ప్రణాళిక ఉండాలని, దిని పై అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రతి జిల్లా స్థాయిలో ఉన్న రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించి, ఆక్సిడెంట్ ప్రోన్ ఏరియా గుర్తించాలని, అక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి పాఠశాల పరిసరాలలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు చిన్నతనం నుంచి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఉండాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై లోకల్ ఎఫ్.ఎం రేడియో, కేబుల్ చానల్స్ లో టెలికాస్ట్ అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రోడ్లు, జాతీయ రహదారుల్లో అవసరమైన సైన్ బోర్డులు ఉండేలా జిల్లా రవాణా శాఖ అధికారి పర్యవేక్షించాలని సూచించారు. 

ఈ వీడియో సమావేశం అనంతరం జిల్లా అధికారులతో సమావేశమై  జిల్లా కలెక్టర్..

 ఈ సందర్భంగా సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ. రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమాలు విజయవంతం చేయడానికి పటిష్ట ప్రణాళికల ద్వారా చర్య తీసుకుంటున్నామని. జిల్లాలో 33 బ్లాక్ స్పాట్స్  గుర్తించడం జరిగిందని ప్రమాదాల నివారణకు  అధికారులు సమిష్టిగా పనిచేయాలన్నారు. కళాశాలలో యువతకు రోడ్డు ప్రమాదాలపై జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.  జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు కేవలం డ్రింక్  అండ్ డ్రైవ్, అవగాహన లేమి డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలను అతిక్ర మించడం ప్రమాదాలు జరుగుతాయని, ప్రమాదాల నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగంWhatsApp Image 2025-01-04 at 8.58.33 PM (1)తోఅనేగా అవగాహన కార్యక్రమాల ద్వారా తోడ్పాటు అందించి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించడం జరుగుతుందని 2024 సంవత్సరంలో అధిక మొత్తంలో డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందని  అతి వేగంతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల బారినబడి ప్రాణాలు కోల్పోయి కుటుంబాల  వీధిని పడే పరిస్థితి ఏర్పడుతున్నాయని రోడ్డు భద్రత మాసవత్సవంలో విస్తృతంగా పాల్గొని శాఖపరంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ సర్దార్ సింగ్, జిల్లా  విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, టీజీ ఆర్టీసీ డిపో మేనేజర్  సురేఖ, రెవిన్యూ,  పోలీస్, రోడ్డు రవాణా,అధికారులతో పాటు మెదక్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్స్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .