విద్యార్థులకు 108 అంబులెన్స్ ద్వారా సిపీఆర్ పై అవగాహన
పెద్దమందడి,అక్టోబర్16(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడిలోని జీవీకే ఈఏంఆర్ఐ 108 అంబులెన్స్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గుండె పనిచేయకపోవడంలో తక్షణ సహాయం (సిపీఆర్) పై అవగాహన శిక్షణ నిర్వహించారు.ఈ శిక్షణలో గుండెపోటు వచ్చినప్పుడు లేదా గుండె పనితీరు ఆగిన సందర్భాల్లో తక్షణ సహాయం ఎలా అందించాలో విద్యార్థులకు వివరించారు. ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది గుండెపోటు మరియు గుండె ఆగిపోవడంలో తక్షణ సహాయ పద్ధతుల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రాక్టికల్ డెమో ద్వారా చూపించారు.ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే పద్ధతులు గురించి అవగాహన పెంచుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, 108 సిబ్బంది భాస్కర్, యోగేశ్వర్, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయ శాంతన్న, 108 వనపర్తి జిల్లా మేనేజర్ మెహబూబ్ పాల్గొన్నారు.


Comments