విద్యార్థులు పై చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

విద్యార్థులకు టై, బెల్టులు పంపిణీ

విద్యార్థులు పై చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

 1991-1992 బ్యాచ్ పూర్వ విద్యార్థులు

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు 1991- 1992 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు టై, బెల్టులు పంపిణీ చేశారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పూర్వ విద్యార్థులు పాల్గొని విద్యార్థులకు టై, బెల్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ... సామాజిక స్పృహతో తాము చదువుకున్న  బడిలో విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో... విద్యార్థులను ప్రోత్సహించేందుకు అందరం కలిసి విద్యార్థులకు ఈ చిన్న సహాయం చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు వారికి కావలసిన వసతులు కల్పిస్తే మరింత చదువుపై దృష్టి పెట్టేందుకు అలాగే ప్రభుత్వ పాఠశాల సంఖ్యను పెంచేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు పై చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని 1991-1992 బ్యాచ్ పూర్వ విద్యార్థులకు సూచించారు. అనంతరం పదవ తరగతి ఫలితాల్లో బెస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినీలకు నగదు బహుమతులు అందజేశారు.WhatsApp Image 2025-08-15 at 6.40.41 PM (1)మొదటి ర్యాంకు విద్యార్థినికి 3000/- రెండవ ర్యాంకు విద్యార్థినికి 1500/- మూడవ ర్యాంకు సాధించిన విద్యార్థినికి 1500/- రూపాయల చొప్పున నగదు బహుమతులు అందజేసి విద్యార్థినీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుడిబండ శ్రీనివాస్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, శాంతయ్య, బండారి నరసింహ, మద్దూరు ఆంజనేయులు, వెంకటేష్, చెన్నయ్య, జగదీశ్వర్ రెడ్డి, నరహరి, పారిజాతమ్మ, అడివన్న, రుక్మద్దీన్, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .