మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సుంకే ప్రభాకర్ నియామకం
హైదరాబాద్,సెప్టెంబర్19(తెలంగాణ ముచ్చట్లు):
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సుంకే ప్రభాకర్‌ను నియమించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ స్వయంగా నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మైస ఉపేందర్ మాట్లాడుతూ, మాదిగ సమాజ హక్కుల సాధనలో ప్రభాకర్ అంకితభావం, కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. సమాజ బలోపేతం కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యతలను అప్పగించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమితి సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లో విస్తరించి, సమాజ అభివృద్ధికి ప్రభాకర్ కీలకంగా మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో సమితి కార్యకలాపాలను మరింత బలపరచడమే ఈ నియామక ప్రధాన ఉద్దేశమని ఉపేందర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సుంకే ప్రభాకర్ మాట్లాడుతూ, సమాజం తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, సమితి సిద్ధాంతాలు, లక్ష్యాలను గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తరించి, మాదిగ సమాజ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకాన్ని మరింత బాధ్యతగా భావించి, సమాజ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతానని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షులు కత్తి విష్ణు,ప్రధాన కార్యదర్శి దాసరి శివ తదితరులు పాల్గొన్నారు.


Comments