వనమహోత్సవంలో    మొక్కలు నాటిన  కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి

వనమహోత్సవంలో    మొక్కలు నాటిన  కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి

కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:

కాప్రా డివిజన్ లోని సి.యస్. నగర్ కాలనీలో నిర్వహించిన  వనమహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటిన కార్పొరేటర్  స్వర్ణరాజ్ శివమణి.
 
ఈ సందర్బంగా కార్పొరేటర్  స్వర్ణరాజ్ శివమణి మాట్లాడుతూ-రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.      

ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏటా జూలై నెలలో నిర్వహిస్తోందని తెలిపారు. మొక్కలు నాటుదాం పర్యావారణాన్ని కాపాడుదాం అని  నినాదాన్నందించారు. ప్రతి ఒక్కరు భాధ్యతగా మొక్కని నాటాలని పిలుపునిచ్చారు. 

మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  విఠల్ నాయక్  మాట్లాడుతూ- మొక్కలు పెంచడం ద్వారా వాతావరణం లో ఆక్సిజన్ శాతం పెరుగుతుందని పేర్కొన్నారు.  

ఈ  కార్యక్రమంలో యుబిడి మానేజర్ లోకేష్, సి యస్ నగర్ ఆర్ డబ్ల్యు ఏ మెంబర్స్ వర ప్రసాద్, నాయర్, రచనా రెడ్డి, మణి,డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు  కొబ్బనూరి నాగశేషు గారు, జిల్లా ఏఎంసి డైరెక్టర్ పూర్ణయాదవ్ , కాప్రా డివిజన్ కాంగ్రెస్ నాయకులు పి పవన్ కుమార్, శ్రీకాంత్ గౌడ్, మల్లారెడ్డి, నరేందర్ గౌడ్, జి సత్యనారాయణ, టి శ్రీహరి, శ్రీధర్ రెడ్డి, సంతోష్ చారి, సురేందర్ రెడ్డి, సోమ్ నాధ్, మనోజ్ కుమార్, డివిజన్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జి అరుణ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .