తెలంగాణ భవన్ లో చాకలి ఐలమ్మకు నివాళులు

తెలంగాణ భవన్ లో చాకలి ఐలమ్మకు నివాళులు

నాచారం, సెప్టెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు)

సామాజిక సమానత్వం, న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్సీ ఎల్. రమణ అన్నారు. నిస్సహాయుల పక్షాన నిలబడి చేసిన ఆమె త్యాగాలు, పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.తెలంగాణ భవన్లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రైతాంగ ఉద్యమంలో అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె పోరాటం నేటికీ ప్రేరణగా నిలుస్తోందని రమణ అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, గంధం నాగేశ్వరరావు, విట్టల్ యాదవ్, భూపాల్ రెడ్డి, కట్ట బుచ్చన్న గౌడ్, మధుకర్, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .