తెలంగాణ ప్రభుత్వమే ఉద్యమకారులను ఆదుకోవాలి.
టియుపిఎస్ సమన్వయ కర్త చిలువేరు రమేష్.
హాసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ ఉద్యమ కారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని టియుపిఎస్ సమన్వయ కర్త చిలువేరు రమేష్ అన్నారు. శనివారం రోజు హసన్ పర్తి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు అంటే ప్రభుత్వానికి చిన్న చూపు ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనిఫెస్టో లో ఉద్యమకారుల అంశాన్ని చేర్చారు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఎప్పుడు కమిటీ వేస్తారో చెప్పాలని అన్నారు. ఉద్యమకారులు రోజు రోజుకు క్షీణించి పోతున్నారని రెక్కాడితే గానీ డొక్కా నిండని స్థితిలో ఉద్యమకారులు ఉన్నారని తెలియ చేయడానికే ఖమ్మంలో శాంతియుత రిలే నిరహార దీక్షలకు పోలీసుల నుండి అనుమతులు తీసుకొని దీక్ష చేయడం కోసం కదిలి వచ్చిన ఉద్యమకారులను అక్రమంగా అరెస్టులు చెయ్యడం బాధాకరమని అక్రమ అరెస్టులతో తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమాన్ని ఆపలేరని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తేదీ వరకు మా హక్కులకోసం ప్రకటన రానియెడల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 100 మంది ఉద్యమకారులంనామినేషన్వేస్తామనిహెచ్చరించారు.ఉద్యమకారుల బాధలను ఆచరణలోకి తీసుకొని సత్వరమే న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో భాషబోయిన రవీందర్ యాదవ్,జ్ఞానేశ్వర్, పబ్బు రాజేందర్,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


Comments