రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
హసన్ పర్తి మండలం లో రైతుల సంబరాలు
హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు హాసన్ పర్తి మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు సీఎం రేవంత్ రెడ్డి కి పాలాభిషేకం చేశారు.దేశానికి అన్నం పెట్టే రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీతో పాటు, రైతు పండించిన సన్న వడ్లకు క్వింటాలు కు 500 రూపాయలు బోనస్ రైతుల అకౌంట్ లో జమ చేసి రైతు సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నందన్నారు.ఈ కార్యక్రమంలో హసన్ పర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి , ఆత్మకూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తంగేళ్లపల్లి తిరుపతి , మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు వట్టే శ్రీనివాసరెడ్డి , పెడపల్లి సొసైటీ చైర్మన్ గోపాల్ రెడ్డి , ఆత్మకూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జాడి రాజీవ్ గాంధీ , గౌరీ రాజిరెడ్డి , పల్లె దయాకర్ కాంగ్రెస్ నాయకులు బుర్ర సారంగపాణి , కనపర్తి కిరణ్ , రేణిగుంట్ల అశోక్ , వీసం సురేందర్ రెడ్డి , ఎర్ర ప్రకాష్ , ఎల్లాపూర్ కిసాన్ సెల్ అధ్యక్షుడు బొద్దిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి , వీరబోయిన తిరుపతి , పెడపల్లి రవి , చంటి రెడ్డి , కుమార్ , గోవర్ధన్ , బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments