చేగువేరా 58వ వర్ధంతి సంస్మరణ సభ
ఏ ఎస్ రావు నగర్, అక్టోబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ప్రపంచ విప్లవ వీరుడు చేగువేరా 58వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఉదయం కమలానగర్ ఆఫీసులో సంస్మరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరి రావు అధ్యక్షత వహించారు. సీనియర్ నాయకులు ఉదయ భాస్కర్ చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఉదయ భాస్కర్ మాట్లాడుతూ — ప్రపంచ యువకులకు ఐకాన్‌గా నిలిచిన చేగువేరా క్యూబా విప్లవాన్ని విజయవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. ఫెడరల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబాలో సోషలిజం ఏర్పాటు చేయడంలో కీలక భూమిక వహించిన ఆయన, తరువాత లాటిన్ అమెరికా దేశాలలో కూడా విప్లవాలకు మార్గదర్శకుడయ్యారని అన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినా పోరాట దీక్షతో చివరి వరకు రణరంగంలో నిలిచిన చేగువేరా నిజమైన ప్రపంచ విప్లవకారుడని ఆయన గుర్తుచేశారు.స్ఫూర్తి గ్రూప్ సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ, గొడుగు యాదగిరి రావు కూడా ప్రసంగించి చేగువేరా సేవలను స్మరించారు. అనంతరం పాల్గొన్న వారందరూ చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎం. శ్రీనివాసరావు, ఎన్. శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, నవతెలంగాణ రవి, గౌసియా, శోభ, ఉదయ భాస్కర్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Comments