విద్యార్థులకు విద్యతో పాటు, నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
-జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య
-విద్యార్థులు నిర్దేశించిన లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలి
-తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల చదువును ఆపొద్దు
టేక్మాల్ ప్రతినిధి,తెలంగాణ ముచ్చట్లు:
విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టిందని అందులో భాగంగానే ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్ ప్రభుత్వ పాఠశాలలో డైట్ కాస్కోటిక్ చార్జీల పెంపు చేసిందని డిపిఓ యాదయ్య అన్నారు. శనివారం మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో గిరిజన ఆశ్రమ బాలికల విద్యాలయంలో బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీటీలకు అందించి డేట్ కాస్కోటి చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య. మండల అభివృద్ధి అధికారి విటల్ తో కలిసి నూతనంగా చార్జీల డైట్ మెనూ చాట్ ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా పంచాయతీ అధికారి మరియు టేక్మాల్ మండల ప్రత్యేక అధికారి యాదయ్య మాట్లాడుతూ. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మంది అన్ని ప్రభుత్వ,సంక్షేమ,రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా ప్రభుత్వం పటిష్ట ప్రణాళిక ద్వారా ముందుకు పోతుంది అన్నారు.
డైట్, కాస్మోటిక్స్ చార్జీల పెంపు ప్రారంభోత్సవంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎంతగానో దోహదపడుతుందన్నారు.. విద్యార్థులకు ప్రభుత్వపరంగా ఉచితంగా యూనిఫామ్ లు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు
అందించామన్నారు.
విద్యార్థిని విద్యార్థులు, చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో నిలవాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలన్నారు. గిరిజన ఆశ్రమ బాలికల విద్యాలయంతో సహా బిసి ఎస్సీ బాలుర సంక్షేమ కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించిందని ఆయన తెలిపారు. ప్రతి రెసిడెన్షియల్ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థుల శ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలను, 200 శాతం కాస్మొటిక్ చార్జీలను పెంచడం జరిగిందన్నారు. తద్వారా విద్యార్థిని విద్యార్థులకు పోషకాలతో కూడిన బలవర్ధక పౌష్టికాహారం అందించి విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అభ్యసించాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయన అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామనే భావనను దరి చేరనివ్వకుండా ఏకాగ్రతతో చదువుకుని జీవితంలో విద్యార్థులు స్థిరపడడం ద్వారా కన్నవారి కలలు నిజం చేయాలని, గురువులకు మంచి పేరు తేవాలని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ఉన్నంత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
డైట్ చార్జీల గురించి వివరిస్తూ మూడో తరగతి నుండి ఏడవ తరగతి చదువుకునే విద్యార్థులకు 950 ఉన్న డైట్ చార్జీలను 1330కి పెంచడం జరిగిందన్నారు, 8వ తరగతి నుండి పదవ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు
1160 ఉన్న డైట్ చార్జీలను 1540కి పెంపు చేయడం జరిగింది అన్నారు.
కాస్మోటిక్ ఛార్జీల గురించి వివరిస్తూ 8వ తరగతి నుండి పదవ తరగతి చదువుకునే 11 సంవత్సరాల బాలికలకు 55 నుండి 175 రూపాయలు పెంపుదల చేసినట్లు వివరించారు, మూడో తరగతి నుండి ఏడవ తరగతి చదువుకునే బాలురకు హెయిర్ కటింగ్ చార్జీలు 62 రూపాయల నుండి150 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు, ఎనిమిదో తరగతి నుండి పదవ తరగతి చదువుకునే 11 సంవత్సరాలు దాటిన బాలురకు హెయిర్ కటింగ్ చార్జీలు 62 రూపాయల నుండి 200 రూపాయలు పెంచడం జరిగిందన్నారు. కాస్మోటిక్ డైట్ చార్జీల పెంపుతో విద్యార్థుల్లో నూతన ఉత్సాహం, కనపడిందని ఆయన వివరించారు.
విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని అన్నారు. మండలంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలను ఇకనుండి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారని, కొత్త డైట్ మెనూ ప్రకారం వసతిగృహాల్లో పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా పరిశుభ్రతను పాటిస్తూ నాణ్యమైన భోజనం ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారా లేదా అన్నది స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని డిపిఓ యాదయ్య అన్నారు. ఈకార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి విట్టల్, నాయక్, ఎంపివో రియాజ్ దీన్, గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల హాస్టల్ వార్డెన్ లలితా బాయ్, బీసీ సంక్షేమ బాలుర హాస్టల్ వార్డెన్ బాబు. ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు..jpeg)


Comments