సత్తుపల్లిలో ‘‘ఓటు చోర్’’ కార్యక్రమంపై బీజేపీకి ఘాటు ఖండన.

సత్తుపల్లిలో ‘‘ఓటు చోర్’’ కార్యక్రమంపై బీజేపీకి ఘాటు ఖండన.

సత్తుపల్లి, అక్టోబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘‘ఓటు చోర్’’ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భాస్కర్ వీరంరాజు మాట్లాడుతూ,  నిన్న మొన్న సత్తుపల్లిలో కొంతమంది ‘ఓటు చోర్’ పేరుతో సంతకాల సేకరణ చేయడం విచారకరం. అసలు ఓటు చోరు ఎప్పుడు జరిగింది? గతంలో గాంధీ వారసత్వాన్ని ఎవరు చోరీ చేశారు? అప్పటి నుంచి ఇప్పటివరకు కుటుంబ పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఆరోపణలు సరిగ్గా సరిపోతాయి అని అన్నారు.

సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాల్సిన సందర్భంలో 15 ఓట్ల తేడాతో నెహ్రూను ప్రధాని చేశారు. అది ఓటు చోరు కాదా? ఇందిరా గాంధీ ప్రభుత్వం కూలిపోతుందని తెలిసి అత్యవసర పరిస్థితి విధించి ప్రజాస్వామ్యాన్ని కూలదోసారు. అది ఓటు చోరు కాదా? ప్రస్తుత ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో ఉన్నారు — అది ఏమిటి?అంటూ ఆయన ప్రశ్నించారు.

అధికారాల కోసం పార్టీలు మారుతూ పదవులు పొందడం మీ రాజకీయ శైలి. మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టేనా? బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం ఓడిందా? మీ వ్యవహారం ‘ఆడలేక బోడి మల్లన్న’లా ఉంది’’ అని భాస్కర్ ఎద్దేవా చేశారు.

పట్టణ బీజేపీ అధ్యక్షుడు భానోత్ విజయ మాట్లాడుతూ, సత్తుపల్లిలో స్వేచ్ఛగా ఇసుక, మట్టి దందాలు సాగుతున్నాయి. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు వేస్తున్నారు. అధికారుల్ని అడ్డం పెట్టుకొని ప్రజలను భయపెడుతున్నారు. నరేంద్ర మోడీ వ్యక్తి కాదు — శక్తి. ఆయనతో పోటీ పడినవారికి రాజకీయ భవిష్యత్తే లేకుండా పోయింది అని అన్నారు.

బీజేపీ గెలిస్తే ఓట్లు చోరీ చేసినట్టుగా, మేము మాట్లాడితే ప్రజలు నమ్మరనే విధంగా ప్రవర్తించడం హాస్యాస్పదం. ముందుగా సత్తుపల్లిలో అభివృద్ధి పనులు చూపించండి, హామీలు నెరవేర్చండి. 100 పడకల ఆసుపత్రి ప్రారంభించండి. ప్రజలను తప్పుదోవ పట్టించే సంతకాల సేకరణలు మానండి అని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఆచంట నాగస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి మంద శివ, కార్యదర్శి జోన్ బోయిన కార్తీక్, మాజీ మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్, IMG-20251012-WA0010పరస రాంబాబు, తెనాలి అశోక్, సాయి, మన్నేని నరసింహమూర్తి, వంశీ, మెరుగు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .