వనపర్తికి కేంద్రీయ విద్యాలయం మంజూరు
జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది
జిల్లెల చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
వనపర్తి,అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “వనపర్తి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం స్థాపన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాం. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ప్రతిపాదనలు పంపడంతో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో జిల్లా ప్రజల స్వప్నం నెరవేరింది” అని తెలిపారు.అలాగే, కేంద్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ – “కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని, నిధులను ప్రభుత్వం త్వరగా కేటాయించేటట్లు చూసి, పనులు వేగంగా పూర్తయ్యేలా కృషి చేస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.


Comments