రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కింది
ఖిల్లా ఘనపురం మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండల మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్ విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు లగాచర్ల రైతులపై రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెట్టి, రైతులను జైల్లో పెట్టి, రైతులకు పేడీలు వేసిన సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తూ... మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, మాజీ ఎంపీపీ కృష్ణ నాయక ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... లవర్చర్ల రైతులను రాజ్యాంగ విరుద్ధంగా రైతులపై కేసులు పెట్టి రైతు కుటుంబాలను దిక్కులేని వారిగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్, గ్రామ అధ్యక్షులు బాల్ రెడ్డి, చిన్న ఆంజనేయులు గౌడ్, చిన్నారెడ్డి, గొడుగు సత్యం, బుచ్చిబాబు గౌడ్, పెద్ద ఆంజనేయులు గౌడ్, పోలిశెట్టి ప్రతాప్, బాధగాని చెన్నయ్య, పొయ్యికటి చెన్నయ్య, బెస్తా ఆంజనేయులు, బాధగాని కురుమయ్య, గోనెల రామచందర్, కొరిగేల రాజు, తదితరులు పాల్గొన్నారు.


Comments