ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలను పకడ్బందీగా సేకరించాలి
రాష్ట్ర రెవెన్యూ,సమాచార,గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు
:
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన 80 లక్షల మందికి సంబంధించిన వివరాలు డిసెంబర్ చివరికి సేకరించాలని రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్‌ను నియమించి, క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని సూచించారు. సేకరించిన డేటా రాబోయే నాలుగేళ్ల వరకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.
గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు కఠిన చర్యలు
డిసెంబర్ 15, 16 తేదీల్లో జరిగే గ్రూప్ 2 పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. అభ్యర్థుల కోసం ప్రత్యేక ఓఎంఆర్ షీట్లను సిద్ధం చేయగా, పరీక్షల నియమాలను జిల్లా అధికారులకు వివరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు.
డైట్ చార్జీల పెంపు కార్యక్రమం ప్రారంభం
డిసెంబర్ 14న రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్, పాఠశాలల్లో డైట్ చార్జీలను 40 శాతం పెంచిన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.
పర్యవేక్షణకు ప్రత్యేక దృష్టి
ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సేకరణలో ప్రజా ప్రతినిధులు, కమిటీలు భాగస్వామ్యం కావాలని, షెడ్యూల్‌ను ముందుగానే ప్రజలకు తెలియజేయాలని మంత్రి సూచించారు. హాస్టల్స్ బియ్యం నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో వీటిని వెంటనే పరిష్కరించాలన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు..jpeg)


Comments