జిల్లాను అగ్రగామిగా నిలపాలి

-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

జిల్లాను అగ్రగామిగా నిలపాలి

-సీఎం కప్ పోటీల్లో అధిక పతకాలు సాధించాలి

-2కె రన్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:

సీఎం కప్ పోటీల్లో జిల్లా అగ్రగామిగా నిలబడి అధిక పతకాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాల భాగంగా 1 డిసెంబరు 2024 నుండి 9 డిసెంబరు వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మరియు అదనపు కలెక్టర్ సంధ్యారాణి కలిసి 2కె రన్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ వరంగల్ నగరంలోని కాశీబుగ్గ జంక్షన్ నుండి ఓ సిటి స్టేడియం వరకు సాగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, క్రీడాకారులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, 7, 8 తేదీల్లో గ్రామస్థాయిలో, 10 నుండి 12వ తేదీ వరకు మండల స్థాయిలో, 16 నుండి 21వ తేదీ వరకు జిల్లా స్థాయిలో సీఎం కప్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

తదనంతరంగా, వారు జిల్లా స్థాయి క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన ప్యారాలింపిక్స్ గేమ్స్ లో జివాంజి దీప్తి మన జిల్లాకు పతకం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించాలని కలెక్టర్ ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి సత్యవాణి, డిపిఆర్ఓ ఆయూబ్ అలీ, పశు సంవర్ధక శాఖ అధికారి బాలకృష్ణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కైలాష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .