ఇందిరా ఫెలోషిప్ ప్రతినిధుల కృషి అభినందనీయం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
మహిళా సాధికారతకు, అన్ని రంగాల్లో వారు రాణించేందుకు ఇందిరా ఫెలోషిప్ సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో ఇందిరా ఫెలోషిప్ సభ్యులతో సంభాషించారు. మహిళలను రాజకీయ రంగంలోకి ప్రోత్సహించేందుకు, అలాగే సామాజిక, ఆర్థిక రంగాల్లో వారికి స్వతంత్రతను అందించేందుకు రూపొందించబడిన ఈ జాతీయ కార్యక్రమం మహిళా సాధికారతకుదోహదపడుతోంది.
తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ఇందిరా ఫెలోషిప్ సభ్యులు, మహిళల రాజకీయ, ఆర్థిక శక్తి వృద్ధి కోసం చేపట్టిన తమ కార్యకలాపాలు, ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సల్ల సౌజన్య, చరిత్రలో ఎం.ఏ చేసిన ఈ.వి. సాత్త్విక, దేవరకొండ ఎం.పి.టి.సి కొర్రా గౌతమీ, జహీరాబాద్ నుండి డాక్టర్ ఆస్మా తబస్సుం, రాజకీయ శాస్త్రంలో ఎం.ఏ చేసిన కె. నిహారిక ఉన్నారు.
ఈ సభ్యుల కృషిని అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు మహిళలు అందరూ సామాజికంగా, ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు.


Comments