మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజిస్తూ పండుగ జరుపుకోవాలి.

 పర్యావరణ మిత్ర అవార్డు గ్రహీత ఆకుతోట శాంతారాం కర్ణ.

మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజిస్తూ పండుగ జరుపుకోవాలి.


WhatsApp Image 2025-08-21 at 6.44.59 PM

హసన్ పర్తి, తెలంగాణ ముచ్చట్లు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హసన్ పర్తి గ్రామం 66 డివిజన్ లోని సుజాత విద్యానికేతన్ పాఠశాలలో మట్టి వినాయక విగ్రహాల ఆవశ్యకతపై 1000 కరపత్రాల ఆవిష్కరణ పాఠశాల ప్రిన్సిపల్ ఆకుతోట శాంతారామ్ కర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా పాఠశాల పర్యావరణ మిత్ర యూనిట్ ఆధ్వర్యంలో పరమ పవిత్రమైన పండుగలలో ఒకటైన వినాయక చవితి ప్రకృతి సహజ సిద్ధంగా లభించే మొక్కలు ఆకులతో జరుపుకోవాలని పాశ్చాత్య పోకడలతో మితిమీరిన ఆనందం కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేస్తున్న విగ్రహాలకు పూజ చేస్తూ చెరువులో నిమజ్జనం చేయడం వలన చెరువులు కలుషితమవుతున్నాయి. కనుక మట్టి తో చేసిన వినాయక విగ్రహాలను పూజిస్తూ ప్రకృతిలో లభించే వనమూలికలతో పండుగను జరుపుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా 1500 మట్టి వినాయక విగ్రహాలను విద్యార్థుల చే తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గూడూరు లక్ష్మీనారాయణ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .