ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
వనపర్తి కంటెస్టడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్
వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి పట్టణం లో విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్ఎస్ఎ తెలంగాణ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన న్యాయమైన హామీ లను నెరవేర్చాలని వనపర్తి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ అన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహారా దీక్షకు శనివారం వనపర్తి నియోజకవర్గ కంటెస్టేడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ మద్దతు తెలిపారు. సమగ్ర శిక్ష విద్యావిభాగం లో నేడు కాంట్రాక్ట్ ఉద్యోగుల పాత్ర కీలకం అని సమగ్ర శిక్షా ఉద్యోగులు విద్యా విభాగం లో తీసుకున్న జీతానికి చేస్తున్న పనికి చాలా వ్యత్యాసం ఉంది..ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత గ్రాడ్యుయేట్స్, మేధావులను మల్లి ఇలా దీక్ష లో చూడటం బాధకరం గా ఉందని తెలిపారు. ఇచ్చిన హామీ లు నెరవేర్చుటలో ప్రభుత్వం హుందాగా ఉండాలి.ప్రభుత్వం ప్రజలతో తస్సంబంధాలు బలోపేతంగా ఉండాలని కోరారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల కు మినిమం పే స్కేల్ , ఆరోగ్యభీమా, ఉద్యోగ భద్రత అంశాలపై వీలైన త్వరగా అమలు చెయ్యాలని కోరారు.


Comments