గుమ్మడి వెంకటేశ్వర్లును పరామర్శించిన ఐఎన్టియూసీ బృందం.
సత్తుపల్లి, అక్టోబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక సత్తుపల్లి పట్టణానికి చెందిన ఐఎన్టీయూసీ సీనియర్ నాయకుడు గుమ్మడి వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జే.వి.ఆర్ ఓసీలో ఈపీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఇటీవల అనారోగ్యం కారణంగా హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం కోసం కొత్తగూడెం ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్ ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ బృందం సత్తుపల్లి చేరింది. స్థానికంగా ఆయన స్వగృహంలో కలసి పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతికుమార్, నాగ ప్రకాష్, సీతారామరాజు, ఫిట్ సెక్రటరీలు రామారావు, బాలాజీ, నాగేశ్వరరావు, నాయకులు పోశం శ్రీనివాస్, మల్లారపు కొమరయ్య, కోటి, రఫీ, రషీద్, పొట్టి కిరణ్, రాజశేఖర్, రాంబాబు, రత్నకుమార్, తిరుమలరావు, నరేందర్, సందీప్, మురళి, సదానందం, మున్వర్ ఖాన్ తదితర నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


Comments