ఉమ్మడి వరంగల్ జిల్లా  న్యాయవాద పరిషత్‌ నూతన కమిటీ ఏర్పాటైంది

ఉమ్మడి వరంగల్ జిల్లా  న్యాయవాద పరిషత్‌ నూతన కమిటీ ఏర్పాటైంది

వరంగల్, తెలంగాణ ముచ్చట్లు:

ఉమ్మడి వరంగల్ జిల్లా న్యాయవాద పరిషత్‌ సర్వసభ్య సమావేశం సోమవారం నాడు ఘనంగా జరిగింది. సమావేశం అనంతరం కొత్త కమిటీ ఎన్నికలు నిర్వహించగా, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, పాట్రన్ మెంబర్లు, కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. న్యాయవాదుల ఉత్సాహభరితంగా పాల్గొనగా,సమావేశం జోష్‌ గా సాగింది.

పరిషత్‌ నూతన అధ్యక్షుడిగా చోల్లేటి రామకృష్ణను ఎన్నుకున్నారు. జనరల్ సెక్రటరీగా డాక్టర్ వల్లపు మురళీధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా, కోశాధికారిగా ఎం. సంపత్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా సిహెచ్. చిదంబరనాథ్, పి. సుదర్శన్, పి. ప్రవీణ్ కుమార్, పి. వెంకటేశ్వర్లు వ్యవహరించనున్నారు.

ఇదే సందర్భంగా పాట్రన్ మెంబర్లుగా ఎల్. జలంధర్ రెడ్డి, వై. శ్యాంసుందర్ రెడ్డి, సిహెచ్. ప్రభాకర్ రావు, కె. రాజేశ్వరరావు, కెవికె గుప్తా, పి. సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. నూతన కార్యదర్శులుగా టి. గౌతమ్ ప్రసాద్, కె. పూర్ణచందర్, ముసిపట్ల శ్రీధర్ గౌడ్, పి. కమలాకర్, పి. కీర్తి తేజ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

కార్యవర్గ సభ్యులుగా బోనాల అనిల్ కుమార్, బి. రమేష్, సిహెచ్. నాగమణి, ఎస్. సింధు, వి. సుధా రెడ్డి, టి. లక్ష్మణ్, టి. లింగమూర్తి, బి. ఆదిరెడ్డి, టి. చంద్రశేఖర్, ఎ. నాగరాజు, కె. జగదీష్, టి. శ్రీనివాస్‌లు ఎన్నికయ్యారు.సభ ముగింపు సందర్భంగా నూతన కమిటీకి సభ్యులంతా అభినందనలు తెలియజేశారు. న్యాయవాదుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కమిటీ చురుకుగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తమైంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .