ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పధకాన్ని విద్యార్థులతో భోజనం చేసిన
కార్పొరేటర్ ప్రభుదాస్
కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ నియోజకవర్గం లోమీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని తిరుమలనగర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పధకాన్ని రుచిచూసి, విద్యార్థులతో కలిసి సమపంక్తి భోజనం చేసిన కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మధ్యాహ్న భోజనంలో మెనూను ఖచ్చితంగా పాటించాలని, మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన సరుకులను వాడాలని సూచించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం మధ్యాహ్న భోజన పధకానికి వినియోగించే సరుకుల స్టోర్ ను పరిశీలించారు. సరుకుల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు జానకి కుమారి, శాంత భాయ్, అరుణ దేవి, మాధవి, దేవి, సరిత, కృష్ణమూర్తి, పద్మ, కవిత, అనిత మరియు కాలనీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మురళీ చారి, నిసార్ అహ్మద్ గోరి తదితరులు పాల్గొన్నారు.


Comments