యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే 

యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే 

చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:

జనగాం జిల్లా యువజన కాంగ్రెస్ ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

జనగాం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా బోనాసి క్రాంతి కుమార్, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ యువజన అధ్యక్షులుగా ఇల్లందుల విజయ్, చిల్పూర్ మండల యువజన అధ్యక్షులుగా ఇసురం రాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పొట్లపల్లి శ్రీధర్ రావు గెలిచిన అభ్యర్థులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల నాయకులు, యువత, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకత్వ బాధ్యతలు తీసుకున్న యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ప్రజల కోసం కృషి చేయాలని, పార్టీ పటిష్ఠానికి తోడ్పడాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .