విద్యార్థి దశ  నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి

విద్యార్థి దశ  నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి

తార్నాక, తెలంగాణ ముచ్చట్లు:

విద్యార్థి దశ  నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ ఎసిపి జగన్ విద్యార్థులకు సూచించారు. తార్నాక నారాయణ పాఠశాలలో విద్యార్థులకు ఇన్వెస్టిట్యూర్ సేర్మని  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గాఎ.సి.పి. జగన్, పాఠశాల జిఎం గోపాల్ రెడ్డి,ఎ.జి.యం. బాల పరమేశ్వరావు లు పాల్గొన్నారు. విద్యార్థులకు నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తూ వారికి హెడ్ బాయ్, హెడ్ గర్ల్ బ్యాడ్జెస్ ను వారు అందజేశారు. 

ఈ సందర్భంగా ఎసిపి జగన్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం అలవరచుకోవాలని వారి వారి బాధ్యతలను వారు నిర్వర్తించాలని తెలిపారు. అలాగే విద్యార్థులు మంచి చదువులు చదివి బాధ్యతా యుతంగా భవిష్యత్తులో సమాజా నికి మేలు చేసే విధంగా ప్రతీ విద్యార్థి పాటు పడాల్సిందిగా తెలిపారు. జియం గోపాల్ రెడ్డి  విద్యార్థులలో నాయకత్వలక్షణా లను పెంపొందించే దిశగా తీసుకున్న నిర్ణయాన్ని అభినందించా రు. ఎజియం బాలపరమేశ్వరావు మాట్లాడుతూ చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను అభిరుచిగా అలవరచు కోవాలని తెలిపారు. 

పాఠశాల ప్రిన్సిపాల్ పర్వీన్ మాట్లాడుతూ  విద్యార్థులు క్రమశిక్షణతో పాఠశాల వారు ఇచ్చినటువంటి బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించాల ని సూచించారు.  

ఈ కార్యక్రమంలో ఆర్&డి.హెడ్  మనోహర్, హైస్కూల్ కో- ఆర్డినేటర్. ఆజాద్, ఈ చాంప్స్ ఆర్డి హెడ్ మహేశ్వరి, ఈ-చాంప్స్ కో-ఆర్డినేటర్  లక్ష్మీ భవాని,ఈ -కిడ్జ్. కో- ఆర్డినేటర్- నూర్, హైస్కూల్. ఎ.డి. సురేష్, ఈ చాంప్స్ వి.పి, షాహీన్, పిఈటి నరేష్, ఏఓ మహేందర్, ప్రజల సిబ్బంది పాల్గొన్నారు.WhatsApp Image 2025-07-31 at 7.55.56 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .