యువత పివి చూపిన మార్గదర్శకాన్ని అవలంబించి సన్మార్గంలో నడవాలి

-ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశం ప్రపంచంతో పోటీపడేలా కృషి చేశారు

యువత పివి చూపిన మార్గదర్శకాన్ని అవలంబించి సన్మార్గంలో నడవాలి

-నూతన ఆర్థిక విధానాల రూప శిల్పి, బహుభాషా కోవిదుడు, జ్ఞాన సంపదకు నిదర్శనం పివీ

-రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

యువత పివి చూపిన మార్గదర్శకాన్ని స్ఫూర్తిగా తీసుకొని సన్మార్గంలో నడవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గం బీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో  పూర్వ ప్రధాని భారతరత్న పీవీ నరసింహారావు 20వ వర్ధంతి  సందర్భంగా  పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి పొన్నం ప్రభాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు 

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ముద్దు బిడ్డ  ఉమ్మడి కరీంనగర్ జిల్లా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కి సంబంధించిన  బిడ్డ, వారు అంత అత్యున్నత స్థానానికి ఎదగడానికి మన అందరికీ గర్వ కారణమని అన్నారు. పీవీ నరసింహారావు గారి జ్ఞాపకాన్ని ,వారు ఇచ్చిన మార్గదర్శకత్వం ఈనాటి యువత అవలంభించినట్లైతే అందరూ సన్మార్గంలో నడుస్తారన్నారు. బహుభాషా కోవిదుడు గా, అపార జ్ఞానంతో,అపార చాణక్యుడిగా రాజకీయంగా పదవులే తన వద్దకు వచ్చే విధంగా మౌనంగా ఉంటూనే  ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశమునకు మారు మూల ప్రాంతం నుండి భారత ప్రధాని కావడం మన అందరికీ గర్వ కారణమన్నారు.
ఈరోజు ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగి ఇతర దేశాలతో నిల్బడడంలో ఆర్థిక సంస్కరణలు చేసిన ఘనుడు,విదేశాంగ విధానం ,విద్యా వ్యవస్థ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు అనేకమైన సంస్కరణలు తెచ్చిన పీవీ నరసింహారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూన్ననని తెలిపారు.కుటుంబ సభ్యులందరూ కూడా మంచి సన్మాన మార్గంలో ఉన్నారు ,యువత  ఆర్థిక సంస్కరణల్లో ఆయన ను ఆదర్శంగా తీసుకుంటే విజయాలు సాధిస్తారని అన్నారు.

వంగర గ్రామంలో నవోదయ స్కూల్ రావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.WhatsApp Image 2024-12-23 at 9.33.36 PMనూతన సంవత్సరం క్యాలెండర్ ను పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్  క్యాలెండర్ ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు వాణిదేవి, వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు, కమీషనర్ అఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జూ, ఆర్డీఓ రాథోడ్ రమేష్ స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .