తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలలు దేశంలో ఏ రాష్ట్రంలో  లేవు 

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలలు దేశంలో ఏ రాష్ట్రంలో  లేవు 

-పేద మధ్యతరగతి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలన్నదె ప్రభుత్వ లక్ష్యం  

-డైట్ చార్జీలు 40శాతం పెంచడం చాలా సంతోషంగా ఉంది

-విద్యార్థులు మంచిగ తినాలి, కష్టపడి చదవాలి 

స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:WhatsApp Image 2024-12-14 at 6.30.02 PM (1)

తెలంగాణ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి విద్యార్థులకు గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికీ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యార్థులకు డైట్ చార్జీలు 40శాతం, కాస్మోటిక్ చార్జీలు  రెండు వందల శాతం పెంచారాని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్, కాస్మోటిక్స్ చార్జీల పెంపు, నూతన మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కరుణాపురంలోని బీసీ గురుకుల పాఠశాల (బాలికలు) మరియు జఫర్ గడ్ లోని సోషల్ వెల్ఫెర్ గురుకుల పాఠశాల (బాలికలు)లో  ఏర్పాటు చేసిన మెనూ లాంచింగ్ కార్యక్రమానికి జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 ఎమ్మెల్యే కడియం కు ఘన స్వాగతం పలికిన విద్యార్థులు

అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలని, వారికీ పౌష్టిక ఆహారం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచారాని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పెంచిన చార్జీలతో విద్యార్థులకు  వారంలో ఏ రోజు ఏ విధమైన భోజనం అందించాలని కొత్త మెనూ ఏర్పాటు చేసి నోటిస్ బోర్డుపై పెట్టడం జరిగిందని తెలిపారు. ఆ మెనూ ప్రకారమే ప్రతీ రోజు భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ డైట్ అలాగే కాస్మోటిక్ చార్జీల పెంపు రాష్ట్ర వ్యాప్తంగా 6లక్షల మంది విద్యార్థులకు వర్తించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ రోజు కచ్చితంగా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందే విధంగా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను తమ స్వంత బిడ్డలుగా భావించాలని, వ్యక్తిగతంగా వారి బాగోగులు చూసుకోవాలని తెలిపారు. ప్రతీ తల్లీ తన బిడ్డ కడుపు నిండా తిన్నదో లేదో అనే ఆలోచిస్తుంది. ఇకపై ఏ తల్లీ కూడా గురుకులాల్లో చదివే తన బిడ్డ తిండి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. నేను కూడా 4వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్ లోనే చదువుకున్నానని తెలిపారు. హాస్టల్ లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నాకు తెలుసని తెలిపారు. చదువులో ఆడపిల్లలే మెరుగైనా ఫలితాలు సాధిస్తున్నారని, కావున ఆడపిల్లలను చదువుకు దూరం చేయవద్దని తల్లిదండ్రులను కోరారు. మగ పిల్లలకంటే ఆడపిల్లలే చదువులో ముందు ఉంటున్నారని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని మంచిగా తినాలి,  కష్టపడి చదవాలి తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్, ఎమ్మెల్యే  భోజనం చేశారు. 

ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్, ఆర్డివో, విద్యా శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .