ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి..
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Views: 15
On
-నెలవారీ ఇవిఎం గోడౌన్ తనిఖీ చేపట్టిన జిల్లా కలెక్టర్
ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టర్, కలెక్టరేట్ ఆవరణలోని ఇవిఎం గోడౌన్ నెలవారీ తనిఖీ చేశారు.
ఇవిఎం గోడౌన్ సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలు, సిసి కెమెరాలను పరిశీలించి, పనిచేస్తున్నవి, లేనిది అడిగి తెలుసుకున్నారు. భద్రతా సిబ్బంది షిఫ్టు ల వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. భద్రతా లోపాలు లేకుండా చూడాలన్నారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ సిహెచ్. స్వామి, ఎన్నికల డిటి అన్సారీ, అధికారులు తదితరులు ఉన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments