రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.

ప్రమాదంలో మరో నలుగురికీ తీవ్ర గాయాలు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.


 మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:

 నర్సాపూర్ సమీపంలోని  అటవీ ప్రాంతంలో  మేడలమ్మ గుడి పరిసర ప్రాంతంలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్ర  గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకెళితే  నర్సాపూర్ పంచాయతీరాజ్ శాఖలో  ఏఈగా విధులు నిర్వహిస్తున్న  పాప గారి మనిషా రెడ్డి ( 22) ఆఫీస్ కు ఆటోలో హైదరాబాద్ నర్సాపూర్ కు వస్తున్నారు. అలాగే రుస్తుంపేట చెందిన దూడి ఐశ్వర్య హైదరాబాద్ నగరంలో ఇంటర్ చదువుతుందిWhatsApp Image 2025-01-03 at 8.54.01 PM (1)WhatsApp Image 2025-01-03 at 8.54.01 PM.  సూరారం కు చెందిన మరో వ్యక్తి మొత్తం ముగ్గురు నర్సాపూర్ కు  ఆటోలో వస్తున్న క్రమంలో  మెదక్ వైపు నుంచి  హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు మేడలమ్మ వద్దకు రాగానే కారు ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏఈ మనిషా రెడ్డి, దుడి ఐశ్వర్య  మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా వెనక ఆటోలో ఉన్న మరో ఆటోలో ఉన్న 5 మందికి  తీవ్ర గాయాలయ్యాయి. నర్సాపూర్ పట్టణంలోని ఐదో వార్డు చెందిన వీరు  హైదరాబాద్ నగరం నుంచి కూరగాయలు తీసుకొని వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలయ్యాయి.  వెంటనే వారిని గాంధీ  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఏఈ మనీషా రెడ్డి సంగారెడ్డిలో క్వాలిటీ కంట్రోల్ ఏఈ గా పనిచేస్తుండగా డిప్యూటేషన్ పై నర్సాపూర్ పంచాయతీరాజ్ శాఖ ఏఈగా వారం రోజుల క్రితం  బదిలీపై వచ్చారు. అంతలోనే మృతి ఒడిలోకి చేరడంతో కుత్బుల్లాపూర్ గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .