నేడు (ఆదివారం) ఇస్లామిక్ బహిరంగ సభ
- ముఫ్తీ మహ్మద్ అబ్దుల్ రవూఫ్ ఖాన్ ఖాస్మీ
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
ఇదారా తాలీముల్ ఇస్లాం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 5:30 గం.కు నగర శివారు గొల్లగూడెంలోని మదర్సాలో గొప్ప ఇస్లామిక్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు మదర్సా కరస్పాండెంట్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ ఖాన్ ఖాస్మీ తెలిపారు. ట్రస్ట్ 8 వార్శికోత్సవ సందర్భంగా జరిగే సభలో.. ఖురాన్ మీ నుండి ఏమి కోరుకుంటుంది..! అనే అంశంపై ప్రముఖ ఇస్లాం ఆధ్యాత్మిక పండితులు మహ్మద్ అబ్దుల్ ఖవీ ప్రధాన ఉపన్యాసం చేస్తారని పేర్కొన్నారు. ఆయనతో పాటు తెలుగు ఆధ్యాత్మిక ప్రసంగ కర్త ముఫ్తీ సులేమాన్ అజ్మల్, మౌలానా సయిద్ అహ్మద్ ఖాస్మీ, మౌలానా ముఫ్తీ మహ్మద్ జలాలుద్దీన్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు. ఈ సందర్భంగా తమ మదర్సాలో ఖురాన్ కంఠస్థం చేసిన 11 మంది విద్యార్థులకు అతిధుల చేత సన్మానం ఉంటుందన్నారు. సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఖమ్మంతో పాటు పరిసర ప్రాంతాల ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ ఖాన్ ఖాస్మీ కోరారు.


Comments