గాంధీ భవన్‌లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం

గాంధీ భవన్‌లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు: IMG-20241130-WA0053

గాంధీ భవన్‌లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం చైర్మన్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జాతీయ నాయకులు కొప్పుల రాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, “కష్టపడ్డ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా గుర్తింపు ఉంటుంది. కింది స్థాయి నాయకుల కృషితోనే మనం అధికారంలోకి వచ్చాం. రాబోయే పదవుల్లో వారికి ప్రాధాన్యం ఇస్తాము,” అని చెప్పారు.

బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తూ, “కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకొని 8 లక్షల కోట్ల అప్పులతో ఆర్థికంగా దివాళా తీయించారు. వారి పాలన అడ్డగోలుగా సాగింది,” అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచి పనులను గ్రామ స్థాయిలో ప్రచారం చేయాలని, బీజేపీ మతతత్వ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉందని, ఆయన నాయకత్వంలోనే దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురాగలమని గౌడ్ తెలిపారు.

ఆదివాసీ సమస్యలపై నాగార్జునసాగర్‌లో వారం రోజుల క్యాంపు జాతీయ నాయకులు కొప్పుల రాజు మాట్లాడుతూ, ఆదివాసీ సమస్యల పరిష్కారానికి నాగార్జునసాగర్‌లో వారం రోజుల క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజుకు ఎనిమిది అంశాలపై చర్చించి, అనుసరించాల్సిన కార్యాచరణను సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో బెల్లయ్య నాయక్, ఇతర నాయకులు కీలక అంశాలపై మాట్లాడారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .