గిరిజన హాస్టల్ వర్కర్స్ సమ్మె 29వ రోజుకు చేరింది.!
సత్తుపల్లి, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో పని చేసే డైలీ వేజ్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు, ఎన్నికలకు ముందే కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశాలను అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ సమ్మె శుక్రవారంతో 29వ రోజుకు చేరింది.
సమ్మెను సందర్శించిన సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు చలమాల విఠల్ రావు కార్మికులకు మనోధైర్యం ఇచ్చారు. సమ్మె సాధ్యమైనంతవరకు కొనసాగిస్తూ, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేవరకు పట్టు సడలించకపోవాలని తెలిపారు.
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లూరు చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యుడు కొలికపోగు సర్వేశ్వరరావు తదితరులు శనివారం నుండి సమ్మెను మరింత ఉద్రిక్తంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. సమ్మెలో సుశీల, వెంకటేశ్వరరావు, పార్వతి, రాఘవమ్మ, సత్యనారాయణ, పద్మ, గౌరీ లక్ష్మీ పాల్గొన్నారు.


Comments