అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
Views: 49
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా షెడ్యూల్ కుల అభివృద్ధి శాఖ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి ఏ. శ్రీలత, ఉమ్మడి వరంగల్ జిల్లా షెడ్యూల్ కులముల అధ్యయన కేంద్రం గౌరవ సంచాలకులు డాక్టర్ కె. జగన్ మోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ జగన్ మోహన్ మాట్లాడుతూ, “డాక్టర్ అంబేద్కర్ అసమానతలు లేని సమాజం కోసం జీవితాంతం పోరాటం చేసిన మహానేత. ఆయన ప్రపంచ మేధావిగా ప్రశంసించబడతారు. రాజ్యాంగంతో సమానత్వానికి మార్గదర్శనం చూపారు” అని తెలిపారు.
కార్యక్రమంలో శాఖ సిబ్బంది అనిల్ కుమార్, అరుణ్ లెనిన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments