కాళేశ్వరం–పోలవరం ప్రాజెక్టులపై రెండు విధానాలా..?

రెండోసారి కొట్టుకుపోయిన పోలవరం కాఫర్ డ్యామ్ పై ఎన్డిఏ, ఎన్డిఎస్ఏ మౌనం ఎందుకని ప్రశ్న

కాళేశ్వరం–పోలవరం ప్రాజెక్టులపై రెండు విధానాలా..?

మేడిగడ్డ పిల్లర్లపై వెంటనే దర్యాప్తు.. పోలవరం విషయంలో నిశ్శబ్దం ఎందుకు?

-తెలంగాణ రైతును దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేర్చిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రల ఆరోపణలు

-జీవనాడి ప్రాజెక్టును కాపాడుకుంటామంటూ కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ ప్రతిఘటన

-మాజీ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ప్రశ్నలు

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోలవరం,
కాళేశ్వరం అంశంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. జాతీయ హోదా ఇచ్చి నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో కాఫర్‌ అడ్డంకి రెండోసారి గోదావరిలో కొట్టుకుపోయినా జలభద్రతా సంస్థకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ వద్ద రెండు స్తంభాలకు పగుళ్లు వస్తే “కూలేశ్వరం” అంటూ కూతలు కూసిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు పోలవరంపై మాత్రం మాటదమ్ము లేదని నిలదీశారు. ఒకే నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు ఒక తీరు, ఆంధ్రప్రదేశ్‌కు మరో తీరు ఎందుకు అనుసరిస్తున్నారని ప్రశ్నించారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే 24 గంటల్లోపే జలభద్రతా సంస్థను దింపిన బీజేపీ నేతలు… ఏకంగా పది అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల లోతుకు కూలిపోయిన పోలవరం కాఫర్‌ అడ్డంకి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని కేటీఆర్ ట్విట్టర్‌లో ఎత్తిచూపారు.

2020లో పోలవరం డయాఫ్రం గోడ రెండేండ్లకే కొట్టుకుపోయినా ఎలాంటి స్పందన రాకపోవడం, తాజాగా మళ్లీ కాఫర్‌ అడ్డంకి గోదావరిలో కొట్టుకుపోయినా ఇప్పటికీ జలభద్రతా సంస్థ ఆచూకీ లేకపోవడం పట్ల కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఎస్‌.ఎల్‌.బీ.సీ. సొరంగం కూలిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినా స్పందించకపోవడం కేంద్రం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

దేశానికే అన్నం పెట్టే స్థాయికి రైతును చేర్చిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షతో కుట్రలు సాగిస్తున్న కాంగ్రెస్–బీజేపీ నేతలను ప్రజలు గమనిస్తున్నారని, తెలంగాణ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .