కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆకస్మిక తనిఖీ..
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పౌష్టికాహారం అందించాలి.
జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ .jpeg)
మెదక్ జిల్లా ప్రతినిధి,తెలంగాణ ముచ్చట్లు :
టేక్మాల్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సోమవారం జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్బా బాలికల పాఠశాలలో పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వంట వంటగదిని స్టోర్ రూమ్ ని కూరగాయలను బియ్యాన్ని పప్పులు వంట సరుకులను డీఇవో పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి ఇప్పుడు భోజనం ఎలా ఉంటుంది పోషకాలతో కూడిన నాణ్యమైన భోజనం సమయానికి పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ మాట్లాడుతూ. విద్యార్థులకు పోషకాలతో కూడిన బలవర్ధక నాణ్యమైన భోజనం పోషకాహారంతో పాటు విద్యను అభ్యర్థించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యార్థులు మంచిగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నామని భావనను దరి చేరనివ్వకుండా మంచిగా చదువుకుని జీవితంలో కన్నవారి కలలు నిజం చేయాలని కష్టపడి కాకుండా ఇష్టపడి చక్కగా చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యతోపాటు ప్రభుత్వ నిర్దేశించిన విధంగా మెనూ ప్రకారం ఉదయం టీ. టిఫిన్ మధ్యాహ్నం నాణ్యమైన భోజనం పౌష్టికాహారం విద్యార్థులకు సమయానికి అందించాలని వంట విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని కస్తూర్బా గాంధీ పాఠశాల సిబ్బందికి సూచించారు.


Comments