ఉప్పల్ కుమ్మరి సంఘం భవనం త్వరలోనే నిర్మిస్తా
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, సెప్టెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ కుమ్మరి సంఘానికి ప్రత్యేక భవనం నిర్మాణం కల సాకారం కానుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు.
శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో కుమ్మరి సంఘం ప్రతినిధులు సమావేశమై సంఘ భవన నిర్మాణం కోసం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నేను అమలు చేస్తాను. ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి వర్గం అభివృద్ధి పథంలో నడవాలి. ఈ దిశగా కమ్మరి, కురుమ, ముదిరాజ్ వంటి సంఘాల అవసరాలను తీర్చడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. కుమ్మరి సంఘం భవనం నిర్మించి మాట నిలబెట్టుకుంటాను” అని తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక సంఘాలు సామాజిక ఐక్యతకు ప్రతీకలని, వాటి ద్వారా వృత్తి అభివృద్ధి, యువతకు మార్గదర్శనం కలుగుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వ నిధుల సహకారంతో లేదా కార్పొరేషన్ మంజూరు చేసే నిధుల ద్వారా భవన నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, కురుమ సంఘం నాయకులు జి. బోగుట యాదయ్య, జి. మల్లేష్, భాస్కర్, అశోక్ ఫోటో, బుల్లెట్ కృష్ణ, ఎన్. జంగయ్య, బి. ప్రకాష్, జి. రాధా కిశోర్, కీసర భిక్షపతి, జి. మహేశ్ భిక్షపతి, జి. కృష్ణ (సత్తయ్య) తదితరులు పాల్గొన్నారు.


Comments