15వ పటాలములో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

15వ పటాలములో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

సత్తుపల్లి, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం బి.గంగారం గ్రామంలోని 15వ పటాలములో మంగళవారం వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెటాలియన్ కమాండెంట్ ఎన్.పెదబాబు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఆదికవిగా, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మహాకవిగా రామాయణ మహాకావ్యాన్ని రచించారని, ఆయన ఆచార–విచారాలు ప్రతి భారతీయుడు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఇలాంటి మహనీయుల జయంతులు జరుపుకోవడం ద్వారా యువతకు సత్ప్రేరణ లభిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు దళాధిపతి ఏ.అంజయ్య, సహాయ దళాధిపతులు వై.శ్రీధర్ రాజా, వై.డి.రంగారెడ్డి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .