సతీష్ యాదవ్‌కు డాక్టరేట్ రావడం వనపర్తి కి గర్వకారణం

సతీష్ యాదవ్‌కు డాక్టరేట్ రావడం వనపర్తి కి గర్వకారణం

 వనపర్తి, ఆగస్టు 21(తెలంగాణ ముచ్చట్లు):

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతున్న అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్‌కు డాక్టరేట్ బిరుదు లభించడం వనపర్తికి గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా వనపర్తి పట్టణంలో ఆయన నివాసంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ తరఫున శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ జి.టి. శ్యామ్, జిల్లా అధ్యక్షుడు సి. విశ్వం బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు గద్వాల ఆంజనేయులు, జిల్లా జనరల్ సెక్రటరీ గొర్ల శైలన్ కుమార్ పాల్గొన్నారు.అదే విధంగా, పలు సంఘాల నాయకులు, మిత్రులు, ఆప్తులు కూడా విడివిడిగా సతీష్ యాదవ్‌ను సన్మానం చేశారు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజాసేవ చేస్తూ వచ్చినందుకు ఈ గౌరవం ఒక కలికితురాయని, ప్రజల కోసం చేస్తున్న కష్టానికి ఇది ఒక చిన్న కానుక అని ఎస్.ఎల్.ఎన్. రమేష్, బి సి నాయకురాలు మధులత దంపతులు పేర్కొన్నారు.
భవిష్యత్తులో సతీష్ యాదవ్ మరిన్ని మెట్లు ఎక్కి సమాజ సేవలో మరింత బలాన్ని అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .