బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావును కలిసిన వాసవి జర్నలిస్ట్ ఫోరమ్ ప్రతినిధులు
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 23, తెలంగాణ ముచ్చట్లు;
తెలంగాణ బిజెపి రాష్ట్ర కోశాధికారిగా ఎన్నికైన దేవకి వాసుదేవరావును వాసవి జర్నలిస్ట్ ఫోరమ్ జిల్లా నాయకులు మంగళవారం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ,
తెలంగాణలో బిజెపి ఒక బలమైన శక్తిగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే రోజుల్లో పార్టీ ప్రజల ఆశీస్సులతో అధికారాన్ని చేపడుతుంది. నాకు అప్పగించిన బాధ్యతను క్రమశిక్షణ, పారదర్శకతతో నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను, అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీ నిధుల వినియోగంలో పారదర్శకత అత్యంత ముఖ్యం. కార్యకర్తల శ్రమ, ప్రజల సహకారం సమర్థవంతంగా వినియోగించబడేలా నేను కట్టుబడి పని చేస్తాను. ప్రతి కార్యకర్తకు గౌరవం లభించేలా, పార్టీ క్రమశిక్షణ మరింత బలోపేతం అయ్యేలా కృషి చేస్తాను. దేవకి వాసుదేవరావు తన సమీక్షలో, ప్రజలతో అనుసంధానం బిజెపి బలానికి మూలం. పార్టీకి తోడ్పాటు అందించే ప్రతి ఒక్కరు మన బలమైన స్తంభాలు. మీడియా కూడా ప్రజలకు నిజమైన సమాచారం చేరవేయడంలో ఒక శక్తివంతమైన వేదిక. జర్నలిస్టుల సమర్థ సహకారం ఉండటం మాకు ఆనందంగా ఉంది అని జర్నలిస్ట్ ఫోరమ్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొదుమూరి భద్రయ్య, టి. సంతోష్ చక్రవర్తి, నూకల రామచంద్ర మూర్తి, వందనపు సామ్రాట్, వందనపు ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments